కొంతమంది చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడుతుంటారు. అంత సున్నితమైన మనస్థత్వం గలవారు ఉంటారు. చివరకు ఆత్మహత్యలు చేసుకొని వాళ్లను నమ్ముకున్న కుటుంబసభ్యులకు కన్నీళ్లని మిగుల్చుతారు. ఇటువంటి కోవలోకే చెందింది మరో ఘటన.. అతడు ఓ రోజు తన బంధువుల ఇంటికి వేరే గ్రామానికి వెళ్లాడు. అతడిని అక్కడ దురదృష్టం వెంటాడింది.

ఆ రోజే ఆ ఊరిలో ఓ దొంగతనం జరిగింది. ఎవరు చేశారో తెలియదు కానీ.. ఈ నెపం ఇతడిపై వేశారు. నువ్వే ఈ దొంగతనం చేశావంటూ అవమానించారు. అంతే కాకుండా జుట్టు మొత్తం కత్తిరించి ఇబ్బందులకు గురి చేశారు. ఆ అవమానం భారం భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బికనీర్‌లోని నోఖా పట్టణానికి చెందిన ఒమారాం జాట్ అనే 25 ఏళ్ల వ్యక్తి నాగౌర్ జిల్లాలోని దవా గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడు వెళ్లిన రోజే దొంగతనం జరిగింది. ఆ దొంగతనం అతడే చేసినట్లు అతడిని అనుమానించి గ్రామంలోని కొంతమంది తీవ్రంగా కొట్టారు. అనంతరం అతని జుట్టు కత్తిరించి అవమానించారు.
అంతేకాకుండా అక్కడ ఆ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత రోజు అతడు తన సొంతూరుకు వెళ్లాడు. ఈ అవమాన భారం భరించలేని అతడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.































