యాంకర్ రవి బుల్లి తెరపై తిరుగు లేని యాంకర్.. తన యాంకరింగ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తిరుగు లేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల రవిపై పలువురు నెటిజన్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బిగ్ బాస్ షోకు వెళ్లిన రవిపై పలువురు దుర్భాషలాడారు. బిగ్ బాస్ లో రవి ఫెర్పామెన్స్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

24 గంటల షోలో కేవలం మీకు చూపించేది గంట మాత్రమే అని.. దాంట్లోనే నన్ను నెగిటివ్ గా చూపించారని.. రవి ఎంత చెప్పినా.. నెటిజెన్ల ట్రోలింగ్, కామెంట్లను ఆపలేదు. రవితో పాటు రవి కూతురు వియాపైన కూడా అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. దీంతో రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని, ట్రోలింగ్ ను అడ్డుకట్ట వేయడానికి రవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ట్రోలింగ్ చేస్తూ.. అసభ్యకరమైన కామెంట్లు చేసే వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి… తాజాగా పోలీసులనే ఇంటికి పిలిపించుకుని.. ట్రోలింగ్, అసభ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను, ఆధారాలను పోలీసులకు అప్పగించాడు.
తనపై, తన కుటుంబంపై కొందరు పనికట్టుకొని విమర్శలు చేస్తున్నారని, కొందరు నెటిజన్లు చేసిన కామెంట్ స్క్రీన్ షార్ట్స్‌ను తన ఫిర్యాదుకు జత చేశారు. మీరు చేయాల్సింది మీరు చేశారు.. నేను చేయాల్సింది నేను చేస్తా అంటూ రవి వ్యాఖ్యలు చేశారు.






























