Dasari Vignan : తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులని సంపాదిస్తున్నాయి. పర భాషల్లో హిట్ గా నిలిచి మార్కెట్ పెంచుకుంటున్నాయి. ఇక పరభాషా చిత్రాలు కంటెంట్ బాగుంటే వాటిని కూడా మనవాళ్ళు ఆదరించడానికి ముందుంటారు. ఇటీవల కన్నడ సినిమా కేజీఎఫ్ వసూళ్లు దీనికి ఉదాహరణ. అయితే ఇప్పుడు మన ప్రేక్షకుల తీర్పు తమిళ సినిమా జనానికి నచ్చడం లేదు. తమిళంతో పాటు పాన్ ఇండియా సినిమా గా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఫలితం దీనికి కారణం. తమిళం లో బాగా హిట్ అయిన పొన్నియిన్ సెల్వన్ తెలుగులో మాత్రం అంతగా హిట్ అవ్వకపోవడం వల్ల తమిళ సినిమా జనాలు గుర్రుగా ఉన్నారు.

తెలుగు క్రిటిక్స్ పై మండిపడుతున్న తమిళ క్రిటిక్స్…
ఇక తెలుగులో చాల మంది క్రిటిక్స్ రివ్యూ ఇచ్చి పొన్నియిన్ సెల్వన్ కి మంచి రేటింగ్స్ ఇవ్వలేది అనేది తమిళ క్రిటిక్స్ వాదన. ఇక ఈ విషయాన్ని తెలుగు సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ సినిమాలో నేటివిటీ ఎవరైనా చూస్తారు, దాన్ని బట్టి మనకు సినిమా ఎంత కనెక్ట్ అయింది అనే దాన్ని బట్టి సినిమాకు రేటింగ్ ఉంటుంది. పొన్నియిన్ సెల్వన్ లో డబ్బింగ్ వల్ల కొంతమంది సహజత్వం దెబ్బతింది ఇక మొదటి సారి సినిమా చూస్తే అంతగా అర్థం కాదు, ఇది ఒక కారణం.

కేవలం రేటింగ్స్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవ్వవు. కానీ వారి వాదన వేరేలా ఉంది. తమిళం లో మన తెలుగు సినిమాలైన బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లు బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు తమిళ క్రిటిక్స్ వాదన అదే మీ సినిమాలకు మేము మంచి రేటింగ్స్ ఇచ్చి మా సినిమాలతో సమంగా ఆదరస్తున్నాం కానీ మీరు మాత్రం మా సినిమాలకు రేటింగ్స్ తక్కువ ఇచ్చి ఫ్లాప్ చేస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్ లో తెలుగు సినిమాలకు కూడా ఇదే పరిస్థితి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తెలుగు సినిమాలకు తమిళ మార్కెట్ మీద ప్రభావం పడుతుందని విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.































