సాధారణంగా ఆడపిల్లలను నీకు తల్లి ఇష్టమా తండ్రి ఇష్టమా అని అడిగితే వెంటనే తండ్రి అంటూ సమాధానం ఇస్తారు. అలా ఒక తండ్రి కూతురు మధ్య సంబంధం అంత బలంగా ఉంటుంది. ఆడ పిల్లలకు రియల్ హీరో తన తండ్రులే అన్నట్లు భావిస్తూ ఉంటారు. కానీ ఒక కూతురు విషయంలో తన తండ్రి విలన్ గా కనిపించాడు. దీంతో తనకు ప్రేమకు అడ్డంగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి తన తండ్రిని చంపేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురు తన భార్యతో కలసి కాప్రాలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా గ్యాస్ ఏజెన్సీ లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జూలై 20న రామకృష్ణ తలకు గాయం అవ్వడంతో, కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయంపై ఇంట్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతడిని ఎవరు గొంతునులిమి బలంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పోలీసులు కుటుంబ సభ్యులను ఆరా తీయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో నారాయణగూడలోని ఒక అపార్ట్ మెంట్ లో రామకృష్ణ కూతురు అపార్ట్మెంట్ వాచ్మెన్ కొడుకు శెట్టి భూపాల్ తో ప్రేమలో పడింది. ఈ విషయంపై రామకృష్ణ తన కూతురిని పలుసార్లు మందలించాడు. భూపాల బాలికకు మాయమాటలు చెప్పి రామకృష్ణ ఇంట్లో 1.75 లక్షల చోరీ చేశాడు.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత భూపాల్ మళ్లీ ఆ బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. బాలిక కూడా భూపాల్ నీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో వారి ప్రేమకు రామకృష్ణ అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని భావించారు. ఇక భూపాల్ తన మిత్రులతో కలిసి ఈ పథకం ప్రకారం.. ఆ బాలికతో తన తండ్రి తినే ఆహారంలో ఒక పౌడర్ ని కలిపి ఇవ్వమని చెప్పాడు. ఆ బాలిక తన ప్రియుడు చెప్పిన విధంగా చేసింది.
ఇక వారు నిద్రలోకి జారుకోగానే భూపాల్ అతని స్నేహితులు కలిసి రామకృష్ణ పై కత్తితో బలంగా దాడి చేశారు. రామకృష్ణ మెలుకువ రాగానే అక్కడి నుంచి పరారయ్యారు. ఇక కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. ఈ విధంగా ఆ బాలిక తన తండ్రి తన ప్రేమకు అడ్డంగా ఉన్నాడు అని చెప్పి ఏకంగా ప్రియుడితో కలిసి తన తండ్రిని హత్య చేయించింది.






























