దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.అదే విధంగా ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రులకు వెళ్ళగా ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్ సౌకర్యం లేక ప్రాణాలు వదులుతున్నారు.ఆస్పత్రిలో చేరిన కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక వారిని బతికించుకోవడం కోసం కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

తాజాగా ఓ మహిళ ఆక్సిజన్ అందక కొనఊపిరితో బాధ పడుతున్న సమయంలో తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలి అనే ఆరాటంతో ఆ కూతురు తన తల్లికి నోటి ద్వారా ఆక్సిజన్ అందించిన ఘటన ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మందిని కలిచి వేసింది.

కరోనాతో బాధపడుతున్న ఆ తల్లిని తన ఇద్దరు కూతుర్లు కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆ మహిళకు ఊపిరి తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా మారిపోయింది.ఈ క్రమంలోనే ఎలాగైనా తన తల్లిని బతికించుకోవాలనే ఆరాటంతో ఆ కూతురు ఏకంగా కరోనా సోకిన తన తల్లి నోట్లోకి తన నోటి ద్వారా ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆ తల్లి మరణించింది.

ఈ సన్నివేశం చూసిన అక్కడ వారు ఎంతో చలించిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే తరహాలోనే గత కొద్ది రోజుల క్రితం భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నోటి ద్వారా ఆక్సిజన్ అందించినప్పటికీ భర్త కూడా మృత్యువాత పడ్డాడు. తాజా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు గత 24 గంటల్లో
3,92,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో 3,673 మంది మరణించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here