Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” సినిమా మేనియా ఇప్పట్లో తగ్గేట్లు కనిపించడంలేదు. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరోసారి పెంచేసిందీ చిత్రం. అల్లు అర్జున్ అద్భుతమైన నటన, సుకుమార్ డైరెక్షన్, దేవీశ్రీ ప్రసాద్ మెస్మరైజ్ మ్యూజిక్… ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించారు.
కాగా సునీల్, అనసూయ ముఖ్యపాత్రలు పోషించగా… సమంత ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ సినిమాకి కేవలం ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన చాలా మంది అగ్ర హీరోలు పుష్ప చిత్రాన్ని వీక్షించినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈయనకు ఇండియన్ సినిమాలన్న పాటలన్న చాలా ఇష్టం. అందుకే వీలుచిక్కినప్పుడల్లా రీల్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటాడు. అలాగే గతంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, విజయ్‌లను ఇమిటేట్ చేస్తూ అలరించాడు. గతంలో అల వైకుంఠపురం చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్‌కు వార్నర్ చేసిన డ్యాన్స్ వీడియో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రారా సామి అంటున్న డేవిడ్ వార్నర్ కూతుళ్ళు !
ఇటీవలే వార్నర్ పుష్ప సినిమాలోని అల్లుఅర్జున్ శ్రీవల్లి పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. ఆ సాంగ్ కి అల్లు అర్జున్ ఎలా డాన్స్ చేశాడో..అలాగే వార్నర్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా వార్నర్ కూతుర్లు రా రా సామి పాటకు క్యూట్ గా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. తన క్యూట్ స్టెప్పులతో ఈ చిన్నారులు అందరి మనసులు దోచుకుంటున్నారు.
Nee yavva taggedhe le #Pushpa
— Prakash – ప్రకాష్ – प्रकाश (@saireddy95) January 23, 2022
Loved these cuties @davidwarner31 @alluarjun @iamRashmika ❤️ pic.twitter.com/VKPHpxRSm8































