David Warner Dance: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతి పాటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ప్రతి పాటకు చాలా మంది డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా చూపే బంగారమాయేనే అనే పాటకు.. సమంత ఐటమ్ సాంగ్ కి ఎంతో క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. ఈ పాటలకు ఎంతోమంది డాన్సులు చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్ విధ్వంసకర క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తనదైన స్టైల్లో మెరిశాడు. ఇప్పటికే డేవిడ్ ఏయ్ బిడ్డా… ఇది నా అడ్డ.. అనే పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్న ఈయన మరోసారి చూపే బంగారమాయేన శ్రీవల్లి అంటూ మరోసారి అభిమానులను సందడి చేస్తున్నారు.
అల్లు అర్జున్ ను దించేసిన డేవిడ్:
శ్రీవల్లి పాటకు అచ్చం అల్లుఅర్జున్ ను దించేస్తూ అతని మాదిరి పాదాలను కదిలిస్తూ.. ఈ పాటకు డాన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియోని వార్నర్ సోషల్ మీడియా ఖాత ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇకపోతే ఇదివరకే వార్నర్ యవ్వా తగ్గేదేలే అన్న డైలాగ్‌ను వార్నర్ తన మేనరిజంతో చెప్పగా.. అల్లు అర్జున్ వెంటనే రియాక్టయ్యాడు. యవ్వ తగ్గేదేలే వార్నర్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.





























