Deepika Padukone : దీపిక పదుకొణె 2006లో కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘ఐశ్వర్య’ సినిమాతో మొదట సినీ రంగప్రవేశం చేసింది. తన రెండవ సినిమాని 2007 లో బాలీవుడ్ లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ లో షారుఖ్ ఖాన్ సరసన చేసే అవకాశాన్ని కొట్టేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దీపిక తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం దీపిక ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్-K సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాక సర్కస్, బ్రహ్మాస్త్ర, జవాన్ సినిమాల్లో సందడి చేయనుంది. అయితే కెరీర్లో రేంత సక్సెస్ సాధించిన మన సెలబ్రిటీలు ఎపుడో ఒకప్పుడు డిప్రెషన్ కి లోనయ్యే వుంటారు. దీపిక కూడా ఇందుకు అతీతం ఏమి కాదు. ఇది వరకు చాలా సార్లు దీని గురించి దీపిక స్వయంగా చెప్పింది.

నిద్రలో మాత్రమే మనం అన్ని బాధలను మర్చిపోవచ్చు…
ఒకపుడు తన జీవితంలో బాగా డిప్రెషన్ కు లోనైన దీపిక, ఇటీవల ఒక మానసిక ఆరోగ్యం గురించిన ఒక కార్యక్రమంలో పాల్గొనింది. అయితే ఇందులో దీపిక మరోసారి తన గత రోజులను ఇలా గుర్తు చేసుకుంది…. హీరోయిన్ గా నా కెరీర్ చాలా బాగుండేది. కానీ, నాకు ఏంటో తెలియని బాధ ఉండేది. బాగా ఏడుపు కూడా వచ్చేది. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలిసేది కాదు. ఆ బాధనుండి బయటపడేందుకు బాగా నిద్రపోవాలనుకునే దాన్ని. ఎందుకంటే నిద్రలో ఒకటే మన బాధలను మర్చిపోవచ్చు” అని చెప్పింది.

అంతేకాకుండా ఆ సమయంలో నన్ను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవి అని, అమ్మ నాన్న నన్ను చూడటానికి ముంబయి వచ్చినపుడు వారి ముందు మాత్రం హ్యాపీ గా ఉన్నట్లు నటించేదాన్ని అని చెప్పింది. అయితే అమ్మ ఒకసారి కనిపెట్టింది అని, అయితే ఏమ్ చెప్పాలో అర్థం కాలేదు. అమ్మ కెరీర్ లో సమస్య అనుకుంది. అయితే అమ్మ సహాయం వలనే డిప్రెషన్ నుండి బయటకి రాగలిగాను అని చెప్పుకొచ్చింది.






























