Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈమె నటించిన కల్కి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేశారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దీపికా పదుకొనే హాజరయ్యారు.

మొదటిసారి ప్రెగ్నెన్సీ తర్వాత బయట కనిపించడంతో పెద్ద ఎత్తున ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఈమె బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ ధరించారు ఇందులో ఈమె బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె కల్కి లాంటి ఒక గొప్ప సినిమాలో నటించే అవకాశం తనుకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమం అనంతరం దీపికా పదుకొనే స్టేజ్ పైనుంచి కిందికి దిగుతున్న సమయంలో ప్రభాస్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. బేబీ బంప్ తో ఉన్నటువంటి ఈమె స్టేజ్ దిగుతున్న సమయంలో పక్కనే ఉన్న ప్రభాస్ లేచి వచ్చి ఆమె కిందికి దిగడానికి సహాయంగా తన చేయి ఇచ్చి తనని ఎంతో జాగ్రత్తగా కిందికి దింపారు.
దీపికకు సాయంగా..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అది కదా మా డార్లింగ్ అంటే అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇలా ప్రభాస్ దీపికాకు సాయంగా నిలవడంతో తనలో ఉన్న మంచితనం మరోసారి బయటపడటంతో ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.



























