Deepika Padukone: యంగ్ రెబెల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన సినిమాలన్నీ కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు కాగా అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈయన వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సుమారు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నటువంటి చిత్రం ప్రాజెక్టుకి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇలా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించారు.
ఈ సినిమా ద్వారా నటి దీపికా పదుకొనే మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దీపికా పదుకొనే భారీగానే డిమాండ్ చేశారని తెలుస్తుంది.

Deepika Padukone: భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక…
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించడం కోసం దీపిక ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చేయడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.



























