Wanted Pandugod: శ్రీధర్ సీపాన దర్శకత్వంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం వాంటెడ్ పండుగాడ్ . ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇక ఇందులో సుధీర్, విష్ణు ప్రియ, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ భరద్వాజ్ వంటి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన అబ్బా,అబ్బా అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ పాటలో నలుగురు హీరోలకు నలుగురు హీరోయిన్లను జోడించి రాఘవేంద్రరావు తన మార్క్ చూపించారు. ఈ పాటలో సుడిగాలి సుదీర్ కి జోడిగా దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ విష్ణు ప్రియ జోడిగా నటించారు. అలాగే ఈ పాటలో సప్తగిరి శ్రీనివాస్ రెడ్డి తో పాటు నిత్యాశెట్టి వాసంతి జోడీలుగా కనిపించారు.ఇక రాఘవేంద్రరావు ఇదివరకు తన సినిమాలలో హీరోయిన్లను ఏ విధంగా అయితే గ్లామరస్ గా చూపించారో ఇందులో కూడా ఈ నలుగురిని అదే విధంగా చూపించారు.
Wanted Pandugod: ట్రెండ్ అవుతున్న లిరికల్ వీడియో…
మొత్తానికి నలుగురు హీరోలు హీరోయిన్లతో ఈ పాటను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మొదటిసారిగా కమెడియన్ల అందరూ కలిసి ఈ సినిమాలో సందడి చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరికి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

































