Deepthi Sunaina: దీప్తి సునయన పరిచయం అవసరం లేని పేరు ఎన్నో వెబ్ సిరీస్ లు కవర్ సాంగ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తోకలిసి ప్రేమలో పడ్డారు ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది బ్రేకప్ చెప్పుకున్న విషయం మనకు తెలిసిందే.

షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి వెళ్లి అక్కడ సిరితో కలిసి ఎంతో చనువుగా ఉండడంతో తట్టుకోలేకపోయినా దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసారు.ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న అనంతరం వారి కెరియర్ పై పూర్తి దృష్టి పెట్టి వరుస వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే సరదాగా అభిమానులతో ముచ్చటించిన ఈమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఓ నేటిజన్ దీప్తిని ప్రశ్నిస్తూ బ్రేకప్ తర్వాత మీ జీవితం ఎలా మారింది అని విషయం గురించి ప్రశ్నించారు ఈ క్రమంలోనే దీప్తి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ రోబోలా తయారవుతున్న అంటూ చెప్పుకొచ్చారు.

Deepthi Sunaina: నవ్విస్తే చాలు..
మరొక నెటిజన్ ఒక మనిషిని మీ పర్సనల్ స్పేస్ లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి మీరు ఎంత టైం తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దీప్తి సమాధానం చెబుతూ కేవలం తనని నవ్విస్తే చాలు అంటూ సమాధానం చెప్పారు. ఇలా నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు దీప్తి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


































