Devara: పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు దీంతో ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పటివరకు మేకర్స్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ తెలియజేయలేదు కానీ ఈ సినిమాలో నటించిన నటి హిమజ మాత్రం ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ విడుదల చేశారు.
ఈ సినిమాలో ఈమె కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులను చెబుతూ డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. ఈ క్రమంలోనే డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ దేవర సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నానని ఈ సినిమా కోసం తాను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పుకు వచ్చారు.
డబ్బింగ్ పనులు…
ఇక ఈ సినిమాకి సంబంధించిన అలాంటి అప్డేట్ తెలియచేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని అందుకే డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. ఇక షూటింగ్ పూర్తి కావడంతో తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.



























