సినిమాల్లో హీరోగా నటించాలంటే.. అతడి కటౌట్ చూసి అందరూ మెచ్చే విధంగా ఉండాలి. కొంతమంది డాక్టర్ కావల్సింది యాక్టర్ అయ్యానంటూ చెబుతుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పే వ్యక్తి హీరో ధనూష్ గరించి. అతడు చూడటానికి హీరోకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు. కానీ అతడి డెడికేషనే అతన్ని హీరో లెవల్లో నిలబెట్టింది.

సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేని ఇతడు తన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా కోరిక మేరకు బలవంతంగా సినిమాల్లో నటించాడు. ఇలా అతడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా కోలివుడ్ లో అడుగు పెట్టిన ధనూష్ స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. సగటు ప్రేక్షకుడిలో తన అభిమాన నటుడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే ఉత్సుకత ఉంటుంది.

అయితే ప్రస్తుతం ధనూష్ రెమ్యునరేషన్, ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అతడు ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటాడట. అతడి ఆస్తులు దాదాపు రూ.180 కోట్ల వరకు ఉండగా.. ఐదు ఖరీదైన కార్ల విలువ రూ.20 కోట్లు వరకు ఉంటాయట.

అయితే ధనూష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను కమిట్ అయ్యారట. దీనికోసం ఏషియన్ సినిమాస్ ధనుష్‌కు రూ. 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్ అత్రాంగి రే, ది గ్రే మ్యాన్ తోపాటు ఓ తమిళ మూవీలో నటిస్తున్నాడు. రజనీ కాంత్ కుమార్తెను ఐశ్వర్యను ఇతడు 2004లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

































