Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన క్రేజ్ కి అనుగుణంగా ఆ సినిమాలో సెలబ్రిటీలను కూడా ఎంపిక చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం పాటు మనుగడ ఉండాలి అంటే ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ వహించాలి ఒక్కసారి షేప్ అవుట్ అవుతే వారికి అవకాశాలు రావడం చాలా గగనం.

అందుకే హీరోయిన్లు ఎక్కువగా ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు జీరో సైజ్ మెయింటెన్ చేస్తూ ఉన్నారా అయితే ఒక్కోసారి ఈ జీరో సైజ్ మంచి మంచి సినిమా అవకాశాలను కూడా కోల్పోయేలా చేస్తుంది. అలా జీరో సైజ్ లో ఉన్నటువంటి రకుల్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవడమేంటి అసలు ఏ సినిమా అనే విషయానికి వస్తే.. దశరథ్ దశకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం మిస్టర్ ఫర్ఫెక్ట్. ఈ సినిమాలో ప్రభాస్ కాజల్ అగర్వాల్ తాప్సి హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
కాజల్ అగర్వాల్..
ఇక ఈ సినిమాలో ప్రియా పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ ఎంతో అద్భుతంగా నటించారు.. నిజానికి ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ కాకుండా ముందుగా రకుల్ ను ఎంపిక చేశారు. ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే రష్ చూసిన తర్వాత ఆమె చాలా సన్నగా కనిపించడంతో షూటింగ్ ఆపేసి ఆమెను ఈ సినిమా నుంచి తీసేశారు అనంతరం మరొక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిన నేపథ్యంలో దిల్ రాజు కాజల్ పేరును సూచించారు అయితే అప్పటికే ఈమె డార్లింగ్ సినిమాలో నటించారు. అయినప్పటికీ ప్రభాస్ తో సినిమా అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు.



























