టాలీవుడ్ లో ‘గోకులంలో సీత’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన రాశి మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అయితే ఆమె ఈ పాత్రకు ఎంపిక కావడానికి కారణం ఎవరో తెలుసా.. సాక్షాత్తు మెగస్టార్ చిరంజీవి భార్య సురేఖ.

అవును మీరు విన్నది నిజమే.. ఇది ఎలా జరిగిందంటే.. ‘గ్యాంగ్ లీడర్’ హిందీ రీమేక్ ‘ఆజ్ కా గూండారాజ్’ లో చిరంజీవి అన్న కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు రాశి. అలా చిరంజీవి ఫ్యామిలీకి రాశి తెలుసు. అయితే ఓ రోజు చిరంజీవి తన భార్యతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైకి వచ్చారు. అక్కడే రాశి వాళ్ల కుటుంసభ్యలు కూడా ఉంటున్నారు.

రాశి వాళ్ల నాన్నకు చిరంజీవి రమ్మంటున్నారని ఫోన్ వచ్చింది ఓ రోజు. వెంటనే రాశి తన ఆల్బమ్ ఫొటోలను తీసుకొని తన తండ్రితో పాటు వెళ్లింది. అక్కడ సురేఖ ఆమె ఫొటోలను చూసి.. చాలా బాగున్నాయి అని కితాబిచ్చారు.

ఆ ఫొటోలు అన్నీ ట్రెడిషన్ దుస్తుల్లో ఉండగా.. వెస్ట్రన్ వేర్‌తో ఒక ఫొటో షూట్ చేద్దామని చెప్పి రాశితో ఫొటోలు తీయించారు సురేఖ. ఆ ఫొటోలు చూశాక తను అనుకున్న పాత్రకు రాశి సరిపోతుందని ఆమెకు అనిపించింది. దీంతో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహిస్తున్న గోకులంలో సీత సినిమాలో చేసేందుకు సురేఖ రికమండ్ చేశారు. అలా రాశి గోకులంలో సీత సినిమాలో నటించారు.



























