కొంతమంది జాతకాలను నమ్ముతుంటారు. రాశుల వారీగా ఈ రోజు ఏం జరుగుతుందో దాని ప్రకారమే ఆ రోజంతా నడుచుకునే వాళ్లు ఉన్నారు. అయితే కేవలం రాశుల వల్లనే కాదు.. పుట్టు మచ్చల వల్ల కూడా జాతాకాన్ని నిర్దేశిస్తాయనేది కొంతమంది నమ్ముతుంటారు. వ్యక్తుల పేర్ల ప్రకారం ఎలా అయితే జాతకాన్ని చూస్తారో.. మానవ శరీరంలో ఉన్న పుట్ట మచ్చల ఆధారంగా.. అదృష్టం దురదృష్టం లాంటివి ఉంటాయి.

అయితే మొదటకు పెదవులపై పుట్టుమచ్చ ఉండటం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందని.. అంతేకాకుండా.. భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. అదే పురుషుల్లో అయితే.. రెండు కను బొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉంటే.. ఆత్మగౌరవం ఎక్కువగా లభిస్తుందట.. అలాగే కుడి కంటిలో ఉంటే కీర్తి పొందుతారట.మనిషి ఎక్కువగా ప్రేమను పెంచాలంటే.. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉండాలట.
అలా ఉన్నవాళ్లు ఎక్కువగా ప్రేమను పెంచుతారట. అదే నాభిపై ఉంటే మాత్రం సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. కుడి భుజం పై పుట్టు మచ్చ ఉంటే అతను చిన్న చిన్న విషయాలకు సీరియస్ అవుతాడని చెబుతుంటారు.
ఛాతి మీద పుట్టుమచ్చ ఉంటే వారికి యవ్వనంలోనే ప్రేమ వైఫల్యాలు ఎదురవుతాయట. ముక్కుకు కుడివైపు పుట్టు మచ్చ ఉంటే అనుకున్న పని పూర్తి చేసే శక్తి ఉంటుందట. ఇక మీకు పైన చెప్పిన విధంగా పుట్టు మచ్చలు ఉన్నాయో లేదో చూసుకోండి.































