Richa Langella: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగిన వారందరూ ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో స్థిరపడతారు.ఈ క్రమంలోనే నటి కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా బుజ్జిగాడు హీరోయిన్ సంజన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రణీత కూడా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది.

ఈ క్రమంలోనే గతంలో రవితేజ, వెంకటేష్, రానా ప్రభాస్ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రిచా గంగోపాధ్యాయ్ ప్రస్తుతం తెలుగు తెరకు దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇకపోతే గత ఏడాది మే 27న రిచా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ క్రమంలోనే తనకు కొడుకు పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే రిచా గంగోపాధ్యాయ్ మరో కొన్ని రోజులలో తన కొడుకు కు ఏడాది పూర్తి కావడంతో తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
చిన్ననాటి స్నేహితుడు…
ఎంతో ముద్దు గా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారికి రిచా ‘లుకా షాన్’ అనే పేరు పెట్టామని పేర్కొంది.ఈ క్రమంలోనే తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు బాబు ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
































