సాధారణంగా మన ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నట్టుగానే ప్రపంచంలోని ఒక్కో దేశానికి ఒక్కో కండిషను ఉంటుంది. అయితే ఆ దేశం విధించిన చట్టాలను అతిక్రమిస్తే వారికి తప్పనిసరిగా శిక్ష అమలు చేస్తారు. ఆ ప్రభుత్వం అమలు చేసిన నియమాలను తప్పనిసరిగా ఆ దేశ పౌరులు పాటించాల్సిందే. మరి ఇక్కడ కొన్ని దేశాలు ఆదేశాలు పాటించే నియమాలు గురించి తెలిస్తే వామ్మో ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా అనక మానరు. మరి ఆదేశాలు ఏమిటి ఆ రూల్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

*వెనిస్ లో పావురాలకు ఆహారం పెట్టడం నేరం. ఆహారం పెట్టడం వల్ల పావురాల రెట్టను శుభ్రం చేయడానికి ఒక్కో పౌరుడి పైన275 యూరోల (రూ.24,324) భారం పడుతోందట. అందుకే అక్కడ పావురాలకు ఆహారం పెట్టడం నిషేధం.
- గ్రీస్‌లోని అక్రోపోలిస్‌లో మహిళలు హై హీల్స్ వేసుకొని నడవడం నేరం.హై హీల్స్ వేసుకోవడం వల్ల అక్కడి భూమి దెబ్బతింటుందని ఈ నిబంధన పెట్టారు.
*శ్రీలంకలో బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీ తీసుకోకూడదు. బుద్ధుడిని పవిత్రంగా భావించేవారు సెల్ఫీ తీసుకోవడం అగౌరవంగా భావిస్తారు.
*బార్సిలోనాలోని మగవారు షర్టు లేకుండా, ఆడవారు బికినీలో తిరిగితే తప్పకుండా జరిమానా కట్టాల్సిందే.
- లొవాలోని ఒట్టుమ్వాలో అమ్మాయిలను చూసి కన్ను కొట్టకూడదట.
*ఇటలీలో ఫెర్రరాలో చీజ్ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది నిద్రపోతే చట్టరీత్యా నేరం.
*ఉత్తర కొరియ లో పౌరులు ఎవరు నీలంరంగు జీన్స్ వేసుకోకూడదు.ఎందుకంటే నీలంరంగు అమెరికాని సూచించడంతో అక్కడ ఆ రంగు నిషేధం.
*బ్రిటన్లో పార్లమెంటులో చనిపోతే నేరం.అక్కడ చనిపోయిన వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉంటుంది కనుక అక్కడ చనిపోవడం చట్టరీత్యా నేరం.
*సింగపూర్ లో చూయింగ్ గమ్ నమలడం నేరం.చూయింగ్ గమ్ నమిలి ఎక్కడపడితే అక్కడ వేయడంతో రోడ్ లు అపరిశుభ్రం అవుతాయి అందుకే ఇక్కడ ఈ కండిషన్ పెట్టారు.
*కువైట్ లో బహిరంగ ప్రదేశాలలో డాన్సులు చేయకూడదు, డాన్సులు ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టకూడదు.
*భారత దేశంలో 1990 నుంచి ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు.






























