Dil Raju: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతంపుత్రోత్సాహంలో ఉన్నారు. దిల్ రాజు రెండవ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఈయన మరోసారి తండ్రిగా మారారు. ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య అనితకు ఒక కుమార్తె ఉంది. అయితే ఆమెకు పెళ్లి అయ్యి పిల్లలు ఉండడంతో దిల్ రాజు తాతగా ప్రమోట్ అయ్యారు. ఇలా తాత అయిన తర్వాత ఈయన మరోసారి తండ్రి కావడం గమనార్హం.

దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మృతి చెందడం వల్ల ఈయన తన సమీప బంధువుల అమ్మాయి తేజస్విని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించారు.దిల్ రాజు మరోసారి తండ్రి కావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే దిల్ రాజు హాస్పిటల్లో తన కొడుకుని చూస్తూ ఎంతో మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో తన భార్య కూడా ఉన్నారు. ఈ ఫోటోని దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రిషియస్ మూమెంట్స్ అంటూ రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతో మంది నేటిజెన్లు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరికొందరు నెగిటివ్ కామెంట్లతో దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.
వారసుడి రాకతో ఆనందంలో ఉన్న దిల్ రాజు…
రెండవ వివాహం చేసుకొని దిల్ రాజు ఇంటికి వారసుడు వచ్చారనే ఆనందంలో ఉండగా కొంత మంది నెటిజన్లు ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ముసలోడే కానీ మహానుభావుడు అనే డైలాగుతో దిల్ రాజును భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉండటం వల్ల తన గురించి వస్తున్న ఇలాంటి కామెంట్లను పట్టించుకునే తీరిక కూడా ఈయనకు లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా దిల్ రాజు కుటుంబానికి వారసుడు రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































