Dimple Hayathi: డింపుల్ హైయతి కిలాడి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అదేవిధంగా ఈమధ్య పోలీస్ అధికారితో వివాదం కారణంగా పెద్ద ఎత్తున ఈమె వార్తలలో నిలిచారు.

ఇలా పలు వివాదాలను ఎదుర్కోవడమే కాకుండా కెరియర్ పరంగా ఏమాత్రం సక్సెస్ లేకపోవడంతో ఈమె ఒకసారి తన జాతకాన్ని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి చూపించారట. ఈ విధంగా వేణు స్వామి ఈమె జాతకం చూసిన అనంతరం జాతక దోషాలు ఉన్నాయని తెలియజేయడంతో తన చేత ప్రత్యేకంగా జాతక పరిహార పూజలు చేయించారని తెలుస్తోంది.
వేణు స్వామి గత కొంతకాలంగా సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన మాటలు కూడా నిజం కావడంతో ఎంతోమంది ఈయనని ఈయన మాటలని నమ్ముతున్నారు. ఇక వేణు స్వామి చేత ఇదివరకే రష్మిక నిధి అగర్వాల్ వంటి సెలబ్రిటీలు ప్రత్యేకంగా పూజలు చేయించారు.

Dimple Hayathi: ఇండస్ట్రీలో సక్సెస్ సాధించేనా…
ఈ క్రమంలోనే డింపుల్ హైయతి సైతం తన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం అలాగే ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ పూజ తర్వాత అయినా ఈమెకు ఇండస్ట్రీలో కలిసి వస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

































