Dipika kakar: ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు సర్వసాధారణం అయ్యాయి. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకోవడం ఇప్పటికి పెద్ద తప్పుగానే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నటుడు షోయబ్ ఇబ్రహీంతో దీపికా కాకర్ మతాంతర వివాహం చేసుకున్నారు. హిందువు అయినా దీపిక ఇస్లాం మతంలోకి చేరి మరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఈమెకు ఇదివరకే వివాహం జరిగినప్పటికీ తన భర్తకు విడాకులు ఇచ్చి మరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఈమె చదువు పూర్తయిన తర్వాత జెట్ ఎయిర్‌వేస్‌లో సుమారు 3 సంవత్సరాలు పనిచేశారు. అయితే, ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం వదిలేసి టీవీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు.

ఇలా ఎయిర్ హోస్టస్ గా పని చేసిన దీపిక పైలట్ రౌనక్ శాంసన్‌ను కలిశారు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా, దీపిక మొదటి వివాహం 2011 సంవత్సరంలో రౌనక్‌తో జరిగింది. ఇలా 2011లో వివాహం చేసుకున్న ఈ జంట 15వ సంవత్సరంలో విడిపోయారు వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం నటుడు షోయబ్ ఇబ్రహీం అని తెలుస్తోంది.
ఇష్ట ప్రకారం మత మార్పిడి..
ససురల్ సిమ్రాన్ కా అనే టీవీ షో సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇలా మీరు పెళ్లి చేసుకోవడానికి మతం అడ్డు రావడంతో దీపిక ముందుగా తన మతం మార్చుకుంది. ఆ సమయంలో ఈమె పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన ఇష్టపూర్వకంగానే మతం మార్చుకున్నాను అని వెల్లడించారు. ఇక ఇటీవల బిగ్ బాస్ 12 పాల్గొన్న ఈమె విజేతగా నిలవడం అనంతరం వీరిద్దరూ కలిసి అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లారు అక్కడి నుంచి ముంబైలోనే ఒక ఆలయానికి వెళ్లడంతో తిరిగి ఈమె వివాదాలలో నిలిచారు.



























