Director Anudeep: జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కామెడీ చిత్రాలను తీయడమే కాకుండా ఈయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుందని చెప్పాలి. ఇకపోతే అనుదీప్ ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే ఆ ఇంటర్వ్యూ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుదీప్ సినిమాల గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలియజేశారు.ఈ క్రమంలోనే తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఈ సందర్భంగా తన వ్యాధి గురించి తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. తనకు హైలీ సెన్సిటివ్ డిజాస్టర్ అనే వ్యాధి ఉందంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కామన్ గా ఉంటాయని అయితే కొందరు వాటిని అర్థం చేసుకోలేరని నా శరీరంలో వచ్చిన మార్పులు కారణంగా నేను ఈ వ్యాధిని గుర్తించాను అంటూ ఈయన తెలిపారు.
ఈ వ్యాధి ఉండటం వల్ల తాను ఎక్కువ కాంతివంతమైన ప్రదేశంలో పని చేయలేనని అదే విధంగా తొందరగా అలసిపోతానని తెలిపారు. ఇకపోతే కాఫీ తాగితే తనుకు రెండు రోజుల పాటు నిద్ర పట్టదని పండ్ల రసాలు తాగిన తన మైండ్ ఆ సమయంలో పనిచేయదు అంటూ అనుదీప్ తాను బాధపడుతున్న వ్యాధి గురించి బయట పెట్టారు. ఇక ఘాటైన వాసనలు చూసిన తాను భరించలేనంటూ ఈయన వెల్లడించారు.

Director Anudeep: నా వ్యాధి గురించి తప్పకుండా సినిమా చేస్తా..
ఇక ఈ వ్యాధితో బాధపడేవారు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసుకొని తాను అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నానని అయితే భవిష్యత్తులో తాను బాధపడుతున్న ఈ వ్యాధి గురించి తప్పకుండా సినిమా చేస్తానంటూ ఈయన వెల్లడించారు.ఇలా ఈ సినిమా చేయటం వల్ల ఈ వ్యాధితో బాధపడే వారికి కొంత వరకు అయినా ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది అంటూ అనుదీప్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























