Director Bobby: తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించారు.వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా డైరెక్టర్ బాబి ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు. దీంతో డైరెక్టర్ బాబీకి హారికకు సంబంధం ఏమిటి అంటూ చర్చలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబీకి చెస్ ఛాంపియన్ హారిక స్వయానా మరదలు అవుతుందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. డైరెక్టర్ బాబి భార్య అనూష సోదరిని హారిక. ఈమెకు డైరెక్టర్ బాబి బావ కావడంతో తన బావ దర్శకత్వం వహించిన సినిమా హిట్ కావాలని ఈమె కోరుకున్నారు.

Director Bobby: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న డైరెక్టర్ బాబీ…
ఇక డైరెక్టర్ బాబి అనూషను ప్రేమించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా డైరెక్టర్ బాబీకి చెస్ ఛాంపియన్ హారిక బంధువులు అవుతారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.































