Director Geetha Krishna : సినిమా విడుదల కాకముందు ప్రమోషన్స్ బాగా చేయడం కామన్. సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటూ రిలీజ్ అయ్యాక కూడా పెయిడ్ రివ్యూస్ తో ఉదరగొడుతున్నారు. ఎన్ని మ్యాజిక్కులు చేసినా సినిమా బాగోలేకపోతే ఆశించినంత కాంటెంట్ అందులో లేకపోతే సినిమా హిట్ కాదు. అందులో పెద్ద స్టార్ హీరో ఉన్నా అదో స్టార్ డైరెక్టర్ సినిమా అయినా సరే హిట్ కాదు. ఈ మధ్య సినిమా చూసే విధానం మారిపోవడం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడమే దీనికి కారణం. ఓటీటీ అందుబాటులోకి రావడంతో సినిమా వారి అభిమాన హీరోదైనా సరే నచ్చకాపోతే లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోగా నిలబడాలంటే టాలెంట్ మాత్రమే కాదు ఎంచుకున్న కథలో కంటెంట్ ఉండాలి. అలా లేకపోతే ఎన్ని ప్రమోషన్స్ చేసిన సినిమా ఫ్లాప్ అవుతుంది. అలా ఫ్లాప్ అయినా కూడా కొంతమంది మాత్రం సినిమా హిట్ అంటూ సక్సెస్ మీట్స్ పెట్టేయడం చూస్తున్నాం. ప్రస్తుతం అల్లు అరవింద్ కొడుకు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా పరిస్థితి అదే…

డబ్బులిచ్చి జనాలతో పొగిడించుకున్నారు…
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అరవింద్ చిరంజీవి ని కాదని బాలకృష్ణ ను ముఖ్య అతిధిగా పిలిచి అటు నందమూరి అభిమానులు సపోర్ట్ చేయాలని భావించారు. ఇక సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేసినా సినిమా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయినా కూడా సినిమా సూపర్ హిట్ అయింది అన్నట్లుగా సక్సెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ఆ ప్రోగ్రమ్ కి ముఖ్య అతిధిగా హాజరు అయి ఎమోషనల్ గా మాట్లాడారు.

ఈ ప్రోగ్రామ్ గురించి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడుతూ సినిమా హిట్ అవ్వకపోయినా హిట్ అయిందని పబ్లిసిటీ చేసుకుంటూ డబ్బులిచ్చి జనాలతో పొగిడించుకోవడం వల్ల జనాల్లో సినిమా హిట్ అనే భావన తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ అసలు ఆ సినిమాను కానీ ఆ సక్సెస్ మీట్ ను కానీ వీటిని పట్టించుకునే తీరికలో ప్రస్తుతం జనాలు లేరు. వాళ్ళకి నచ్చితే సినిమా ఎవరది అని చూడకుండా హిట్ చేస్తారు. లేదంటే అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఫ్లాప్ చేస్తారు అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.

































