Harish Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న హరీష్ శంకర్ ప్రస్తుతం పలు సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా షూటింగ్ పనులలో ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పనులను జరుపుకుంది కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి గాను, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సినిమాలు చేసే సమయం ఉండకపోవచ్చని కాస్త ఆలస్యం అవుతుందని ఇటీవల సినిమాల గురించి ఈయన స్పందించారు. ఇక ఈ విషయం తాను నిర్మాతలకు కూడా చెప్పానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉండకపోవచ్చు అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి ఇదే విషయం గురించి ఒక అభిమాని డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నపై డైరెక్టర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
రూమర్స్ చదివే సమయం లేదు..
ఈ సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే సమయం లేదు అంటూ రాసుకువచ్చాడు. ఈ విధంగా ఈ సినిమా ఆగి పోలేదని కాస్త ఆలస్యమైన ప్రేక్షకుల ముందుకు తప్పనిసరిగా వస్తుంది అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే.



























