డైరెక్టర్ కృష్ణ వంశీ నా గురించి చాలా ధారుణంగా మాట్లాడాడు.. కోట శ్రీనివాస రావు!

0
914

ఒక సినిమాను చిత్రీకరించాలంటే హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా ఆ సినిమాలో పలు కీలక పాత్రలో నటించడం కోసం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎంతో ముఖ్యమని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు.

కోట శ్రీనివాసరావు ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి ఎన్నో అవార్డులను, రివార్డులను కూడా అందుకున్నారు. కెరియర్ మొదట్లో విలన్ పాత్రలో నటించినప్పటికీ ఆ తర్వాత తండ్రి తాత, పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే తెలుగు సినిమా డైరెక్టర్లలో డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కృష్ణవంశీ అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించే మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఓ విషయంలో డైరెక్టర్ కృష్ణ వంశీ కోట శ్రీనివాస్ రావు గురించి ఎంతో దారుణంగా మాట్లాడారు.అసలు కోట శ్రీనివాస్ రావు గురించి కృష్ణవంశీ అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తాజాగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాస్ రావు అంటే ఒక తాగుబోతు అనే పేరు ఉంది. ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటారనే మచ్చ తన పై ఉంది. అయితే ఈ విషయం గురించి కోట శ్రీనివాస్ రావు ఇంటర్వ్యూ వివరణ ఇచ్చారు. ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో షూటింగ్ నుంచి తిరిగి వచ్చి ఒక పెగ్గు తాగి పడుకునే లోపు మూడు గంటల సమయం పడుతుంది. మరి ఐదు గంటలకే నిద్ర లేవాలి. అలా నిద్ర లేవడం మద్యం వాసన వస్తే అందరూ తాను ఒక తాగుబోతు అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. తనకు పెద్దగా మద్యం అలవాటు లేదని తెలిపారు.

ఇక ఈ సందర్భంగా కృష్ణవంశీ కోట శ్రీనివాస్ రావు గురించి మాట్లాడిన మాటలకు కూడా కోట శ్రీనివాస్ రావు వివరణ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు లేరు.. అందుకోసమే నటుడు ప్రకాష్ రాజ్ కు రెండు నంది అవార్డులు వచ్చాయని మాట్లాడారు. అందుకు స్పందించిన కోటా ప్రకాష్ రాజ్ కు రెండు నందులు వచ్చాయంటే ఇతర ఆర్టిస్టులు ఎవరూ సరిగా నటించలేదని కాదు, ముందుగా అలా అన్నందుకు క్షమాపణ చెప్పాలని అనడంతో కోట శ్రీనివాసరావు ఒక తాగుబోతు, తాగి అతడు పిచ్చిపిచ్చిగా మాట్లాడతాడు అంటూ తన గురించి దారుణంగా ప్రచారం చేశారని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు. అయితే అప్పట్లో కుర్ర వయసులో ఉన్న కృష్ణవంశీ ఆవేశంలో ఈ విధంగా మాట్లాడారని ఆ తరువాత కృష్ణవంశీ సినిమాలలో తను నటించానని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు.