Director Pavan Sadineni : ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఒక్కసారి తనవైపు ఇండస్ట్రీ చూసేలా చేసుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని. విజయవాడ కు చెందిన పవన్ సాధినేని అమెరికా వెళ్లి తల్లిదండ్రుల కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తన ఇష్టాన్ని వదులుకోలేక షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. అలా మంచి వ్యూస్ అందుకున్న పవన్ ఆ పైన సినిమాలను డైరెక్ట్ చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆపైన సావిత్రి లాంటి ఫ్లాప్ అందుకున్నా సేనాపతి సినిమాతో మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ అందుకుని తాజాగా జేడి చక్రవర్తి మెయిన్ లీడ్ గా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మంచి హిట్ అందుకున్నాడు. త్వరలోనే పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్న పవన్ సాధినేని తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

సినిమా ఇండస్ట్రీ బయట అనుకున్నట్లు ఉండదు…
పవన్ సాధినేని షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అయితే బెక్కం వేణుగోపాల్ గారు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న పవన్ సాధినేని ఆ తరువాత సావిత్రి సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. అయితే అలా ఫ్లాప్ అందుకోవడం వల్లే తాను ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్న అంటూ చెబుతాడు.

ఇక సినిమా ఇండస్ట్రీలో అందరూ చాలా సున్నిత మనస్కులు ఉంటారంటూ చెప్తాడు పవన్. బయట కనిపించినట్లు లోపల ఉండదని చెప్పారు. బయట అనుకున్నట్లుగా తొక్కేయాలని చూడటం లాంటివి ఉండవని, ఇండస్ట్రీలో అందరూ చాలా స్నేహపూరితంగా ప్రోత్సహం ఇస్తుంటారు. కాకపోతే మన అనుకున్న వాళ్ళు మనకో హోప్ ఇస్తే ఒకవేళ ఆ పర్సన్ ఫెయిల్యూర్ అయితే మనం ఇచ్చిన హోప్ వల్లే అనేది వస్తుందని కొంచం జంకుతారు అంటూ పవన్ తెలిపారు.