Director PNR : పి ఎన్ రాంచంద్ర రావు దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు, కన్నడ, తమిళ్ లో ఎన్నో సినిమాలను తీసారు. కొత్త నటులను పరిచయం చేయడంలో కూడా ముందుంటారు. మానవరాలి పెళ్లి సినిమాతో సౌందర్యను, సహనం సినిమాతో విలన్ గా ప్రకాష్ రాజ్ ను, లీడర్ సినిమాతో ప్రియారామాన్ ను, జాక్ పాట్ సినిమాతో నవీన్ ను, గోల్ మాల్ సినిమాతో నేహా, మీరా వాసుదేవన్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు. అంతేకాకుండా సినిమాలలో హీరోగా కనిపించే ముందు ఎన్టీఆర్ ను భక్త మార్కాండేయ అనే తెలుగు సీరియల్ లో చూపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పిఎన్ఆర్ తాను సినిమాలలో నష్టపోయిన దాని గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఇద్దరినీ కలిపి సినిమా తీయాలని అనుకుంటే…
మెరుపుదాడి సినిమా పిఎన్ఆర్ గారి డైరెక్షన్ లో వచ్చి మంచి హిట్ అందుకుంది. సుమన్, భానుచందర్ తో ఆ సినిమాను తీసిన ఆయన మొదట ఆ సినిమాను మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరినీ పెట్టి సినిమా తీయాలని అనుకున్నారట. అయితే వాళ్ళను అప్రోచ్ అయ్యే లోపే కొత్త హీరోలతో సినిమా చేయాలని భావించి చేశారట. ఒకవేళ వాళ్లిద్దరితో కలిపి సినిమా తీసుంటే నా కెరీర్ వేరేలా ఉండేది అంటూ చెప్పారు.

అయితే కొత్తవాళ్ళతో మంచి హిట్ అందుకున్నాను అనే ఆనందం ఉంది అంటూ చెప్పారు. ఇక వరుసగా ఆ తరువాత చిన్న సినిమాలనే తీసినా పెట్టిన బడ్జెట్ కి న్యాయం చేశాను. ప్రతి సినిమా మంచి కలెక్షన్స్ అందుదుకున్నాయి. అందుకే నా ఇంటికి వచ్చి సినిమా చేద్దాం అన్న ప్రతి ప్రొడ్యూసర్ నాకు దేవుడే. పెద్ద హీరోలతో చేసి ఉండకపోవచ్చు కానీ చిన్న సినిమాలను దాదాపు హిట్స్ చేశాను అంటూ చెప్పారు.