Director Ram Gopal Varma: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల రెండు సంఘటనలలో మెడికల్ స్టూడెంట్ ప్రీతి సుసైడ్ ఒకటైతే మరొకటి హైదరాబాద్ నగరంలో కుక్కల దాడిలో నాలుగేళ్ళ చిన్నారి మృతి. అయితే మీడియా ఫోకస్ అంతా మెడికల్ ప్రీతి సుసైడ్ కేసు మీదే ఉంది. ఇక ప్రభుత్వం నుండి కూడా ప్రముఖులు అందరూ వెళ్లి ఆమెను పరామర్శించడం అన్నీ జరిగాయి. ఆమె విషయంలో న్యాయం చేస్తామంటూ చెప్పడం ఇవన్నీ మీడియాలో చూసాం. అయితే నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో మరణిస్తే ఒక ప్రభుత్వ అధికారి కూడా స్పందించలేదు. అలాగే ఒక సెలబ్రిటీ కూడా మాట్లాడలేదు. దీని గురించి నోరేత్తింది కేవలం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయన కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారి గురించి మాట్లాడటమే కాకుండా ఏకంగా మేయర్ ఇంట్లోకి వీధి క్కుక్కలను వదలాలి అంటూ ట్వీట్ చేసారు. ఇక ఇప్పుడు మరోసారి కుక్కల దాడి గురించి మాట్లాడారు వర్మ.

సుసైడ్ చేసుకున్న అమ్మాయికి అన్ని లక్షలు, మరి ఈ చిన్నారికి…
సుసైడ్ చేసికున్న ప్రీతి విషయం బాధాకరమే కాదని నేను చెప్పను కానీ ఒక సీనియర్ కు ఆమెకు మధ్యలో జరిగిన విషయం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇష్యూ కి ప్రభుత్వానికి సంబంధం లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వం స్పందించి ఆమె కుటుంబానికి 30 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. దీన్ని నేను తప్పు బట్టడం లేదు కానీ ప్రభుత్వం తప్పు లేకపోయినా ఆ ఇష్యూలో ఆమె మృతికి బాధ్యత వహించి డబ్బులు ఇచ్చారు.

అలాంటప్పుడు ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఒక బాలుడు కుక్కల దాడిలో మరణిస్తే మరి ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఎందుకు పట్టించుకోడం లేదు. కుక్కల నిర్వహణలో జీహెచ్ఏంసి వైఫల్యం బయటపడుతుందని పట్టించుకోవడం లేదా అంటూ వర్మ అభిప్రాయపడ్డారు. నగరం మధ్యలో ఒక బస్తిలో అది కూడా పగటి పూట కుక్కలు ఒక పిల్లాడి ప్రాణం తీస్తే పట్టించుకోలేదు. ఇక్కడ ఆ పిల్లాడు ఒక బస్తిలో ఉండే పేదవాడు అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటూ ఫైర్ అయ్యారు.
































