Sandeep Reddy: డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం యానిమల్ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప్ రెడ్డి వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ తదుపరి సినిమాలు ఏ హీరోలతో చేయబోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను మహేష్ బాబు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ పేర్లను చెప్పారు కానీ పవన్ పేరుని చెప్పకపోవడంతో ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు.
సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయకపోయినా కనీసం చేస్తానని మాట వరసకైనా చెప్పొచ్చు కదా అని ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి స్పందిస్తూ.. నేను చిన్నప్పటినుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అభిమానిని తాను అభిమాని అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేనని తెలిపారు. ఎందుకంటే ఆయన రాజకీయాలలో బిజీగా ఉన్నారు డేట్స్ కూడా సరిగా ఇవ్వలేరు అంటూ తెలియచేశారు.
ఫేక్ కామెంట్స్ చేయలేముగా..
ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన కూడా తాను ముందుగా కమిట్ అయినటువంటి డైరెక్టర్లతో సినిమా చేయాల్సి ఉంటుంది అభిమాని కదా అని తన గురించి ఫేక్ కామెంట్ చేయలేము కదా అంటూ ఈ సందర్భంగా సందీప్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యానిమల్ సినిమా తర్వాత ఈయన ప్రభాస్ తో స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.































