Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ తేజ ఒకరు. ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎంతోమంది హీరో హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు.

అభిరామ్ హీరోగా అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చించారు. అదేవిధంగా తన కుమారుడు సినీ ఎంట్రీ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తేజ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఇదివరకు ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలు స్పందించిన తేజ తన కొడుకు సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ… తన కుమారుడికి సినిమాలంటే చాలా ఇష్టం ఈ ఇష్టంతోనే విదేశాలకు వెళ్లి హీరో కావడానికి తగిన శిక్షణ కూడా పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చారు.

Director Teja: హీరోగా శిక్షణ పూర్తి…
ఇక చూడటానికి మా అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉంటారు. అయితే హీరో అవ్వడానికి అందం ఒక్కటే సరిపోదు కదా… అంటూ తన కొడుకు సినీ ఎంట్రీ గురించి తేజ కామెంట్స్ చేశారు.ఇకపోతే తన కుమారుడిని తానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలా లేక మరే డైరెక్టర్ చేత అయినా తనని ఇండస్ట్రీకి లాంచ్ చేయించాలా అన్న విషయం గురించి ఆలోచనలో ఉన్నానని ఈ సందర్భంగా తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.