Director Teja: ఆంధ్ర ప్రజలకు సిగ్గులేదు.. ఆత్మ అభిమానం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ!

0
127

Director Teja: డైరెక్ట్ తేజ ప్రస్తుతం అహింస సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఆంధ్రులకు సిగ్గు లేదని వారికి ఆత్మాభిమానం లేదు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి తేజా ఇలాంటి కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

డైరెక్టర్ తేజ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మనకు పంజాబ్ బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ ఉంది. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు లేదని ఈయన వెల్లడించారు. దాదాపు 90 సంవత్సరాలకు పైగా సేవలను అందించిన ఆంధ్ర బ్యాంకు ను 2020 ఏప్రిల్ ఒకటవ తేదీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారని అయితే ఈ బ్యాంకును విలీనం చేయటాన్ని అడ్డుకోవడానికి ఏ ఒక్క ఆంధ్రుడు ముందుకు రాలేదని ఈయన తెలిపారు.

Director Teja: ఆంధ్ర బ్యాంక్ విలీనం అడ్డుకోలేదు…

ఆంధ్ర బ్యాంకును విలీనం చేస్తున్న మనకేం సంబంధం లేనట్టు ఆంధ్ర ప్రజల వ్యవహరించారని అసలు వారికి ఏమాత్రం ఆత్మాభిమానం లేదని ఈ సందర్భంగా ఈయన మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రాబ్యాంక్‌ని స్థాపించారు. 1980 లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంక్.. జాతీయ బ్యాంకుగా చేశారు.అయితే ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్ అనేది లేకుండా ఈ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారంటూ ఈయన ఆవేదన చెందారు.