Rashi: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రాశి ఒకరు. ఈమె స్టార్ హీరోలు అందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమెకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో హీరోకి మదర్ క్యారెక్టర్ చేశారు. ఇక ఈ సీరియల్ లో రాశి నటన ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ విధంగా రాశి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె డైరెక్టర్ తేజ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ తేజ కారణంగానే తన సినీ కెరియర్ పూర్తిగా నాశనమైందని ఈమె వెల్లడించారు. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో తాను నెగిటివ్ పాత్రలో నటించాను. మల్లి అనే పాత్రలో నటించడమే కాకుండా గోపిచంద్ తో కలిసి మితిమీరిన రొమాన్స్ చేయడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నానని తెలిపారు.
అవకాశాలు తగ్గాయి..
ఇలా నిజం సినిమా సమయంలో డైరెక్టర్ తేజ నాకు చెప్పింది ఒకటి సినిమాలో చేసింది ఒకటి.మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని.. షూటింగ్ మొదలైన తొలిరోజే స్పాట్ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు. ఇలా నెగిటివ్ పాత్రలో చేయటం వల్ల తనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని ఎన్నో విమర్శలు కూడా వచ్చాయని తెలిపారు.



























