VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.
ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్.. ఆడిషన్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.






























