Sneha: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి స్నేహ ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఇతర హీరోయిన్లు మాదిరిగా గ్లామర్ షో చేయకుండా ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈమె తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనంతరం తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా హీరోలకు వదిన అక్క పాత్రలలో నటిస్తూ ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే స్నేహ గురించి అప్పట్లో ఒక వార్త సంచలనంగా మారింది. స్నేహ ఒక హీరోని ప్రేమించింది అన్న కోపంతోనే డైరెక్టర్ తనపై దాడి చేయడంతో ఈమె తీవ్ర గాయాలు పాలయ్యారని తెలుస్తోంది. మరి స్నేహ పై చేయి చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే.. స్నేహ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో డైరెక్టర్ సుశీ గణేషన్ డైరెక్షన్లో సినిమాలు చేసేవారు.
సుశీ గణేషన్…
ఇలా ఈయన డైరెక్షన్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె అనంతరం తనని పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలోనే ఈమె మరొక హీరో ప్రశాంత్ తో కలిసి ఓ సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఈ విషయం తెలిసిన డైరెక్టర్ సుశీ గణేషన్ స్నేహ పై దాడి చేయడంతో ఆమె పెద్ద ఎత్తున గాయాలు పాలయ్యారని తెలుస్తుంది. అయితే తనపై దాడి చేయడానికి కారణం ఆయన స్నేహ పై పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కారణమని తెలుస్తుంది. ఇలా డైరెక్టర్ దాడి చేయడం వల్ల గాయాలు పాలైన ఈమె హాస్పిటల్లో చేరారు అయితే ప్రమాదం కారణంగా ఇలా జరిగిందంటూ అప్పట్లో ఈ వార్తలు ప్రచారం చేశారని తెలుస్తుంది.


































