YVS Chowdary: సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమా చేశారు. నాగార్జున హరికృష్ణ మహేష్ బాబు బాలకృష్ణ వంటి హీరోలతో ఈయన ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ అని సినిమాకి కూడా ఈయన దర్శకుడిగా పనిచేశారు. అయితే ఈయన డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో ఈయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇలా సినిమాలకు దూరమైన వైవిఎస్ చౌదరి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతూ ఈయన మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఇక ఈ సినిమాని హైలెట్ చేయడం కోసం ఈయన ఇప్పటికే రెండు ప్రెస్ మీట్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఇకపోతే వైవిఎస్ చౌదరి అంటే ఎక్కువగా వారి సామాజిక వర్గానికి చెందిన హీరోలతోనే సినిమాలు చేస్తారనే అపోహ ఇండస్ట్రీలో ఉంది. ఇదే విషయం గురించి రిపోర్టర్ ఈయనని ప్రశ్నించారు. మీరు ఎక్కువగా ఒకే సామాజిక వర్గ హీరోలతో సినిమాలు చేయడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురు కావడంతో ఈయన కాస్త ఘాటుగా స్పందించారు.
సాయి ధరమ్ తేజ్ ఏ సామాజిక వర్గం..
నేను ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమా చేస్తాను అనుకుంటే సాయిధరమ్ తేజ్ ఏ వర్గానికి చెందినవారు అంటూ ఎదురు ప్రశ్న వేశారు అంతేకాకుండా తన భార్య గీత ఏ సామాజిక వర్గానికి చెందినదని రిపోర్టర్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇలా తనకు సినిమాల విషయంలో కులమత బేధాలు లేవని చెప్పకనే చెప్పేశారు.



























