ANR -Disco Shanti: డిస్కో శాంతి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె శ్రీహరి భార్యగా మరింత గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి డిస్కో శాంతి ఒకానొక సమయంలో వరుస సినిమాలలో ప్రత్యేక పాటలకు డ్యాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు విపరీతమైన అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే కొందరు వారి అభిమానాన్ని చాటుకోగా మరికొందరు వారి వెకిలి చేష్టలతో ఎంతోమంది సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఇక కొందరైతే సెలబ్రిటీలు జనంలోకి వచ్చినప్పుడు అదే అదునుగా భావించే వారిని తాకరానీ చోట తాకుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటన డిస్కో శాంతికి కూడా గతంలో జరిగిందని తాజాగా వెల్లడించారు. ఏఎన్ఆర్ హీరోగా నటించిన కాలేజీ బుల్లోడు సినిమాలో డిస్కో శాంతి ఏఎన్ఆర్ తో కలిసి రాగింగ్ ఆట అంటూ సాగిపోయే పాటలో నటించారు. ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ కాలేజీ కుర్రాడు కెమెరా పక్కనే నిలబడి డిస్కో శాంతిని చూస్తూ వెకిలి సైగలు చేశారు.

ANR -Disco Shanti: షాక్ లో ఉన్న ఏఎన్ఆర్..
ఈ విధంగా ఆ కుర్రాడు చేస్తున్న వెకిలి సైగలు తనకు ఎంతో అసహ్యం కలిగించాయి. అయితే ఎంతో ఓపికగా ఉన్నారు. ఇక ఈ పాట చిత్రీకరణలో ఏఎన్ఆర్ కత్తెరతో డిస్కో శాంతి డ్రెస్ కట్ చేసి లాగాల్సి ఉంది. ఆ సమయంలో ఆ కుర్రాడు చేష్టలు శృతిమించడంతో తనని దగ్గరకు పిలిచింది. ఇలా దగ్గరకు వచ్చిన ఆ కుర్రాడిని ఒక్క తన్ను తన్ని చెడమడ తనని చితకొట్టింది. ఇలా ఏఎన్ఆర్ ముందే తనని కొట్టడంతో మిగిలిన చిత్ర బృందంతో పాటు ఏఎన్ఆర్ కూడా షాక్ కి గురయ్యారు. అసలేం జరిగిందో తెలియక షాక్ లో ఉన్న వీళ్ళందరూ తేరుకొని తనని అడ్డుకున్నారు.మరుసటి రోజు డిస్కో శాంతిని పిలిచి ఏం జరిగింది అని ఏఎన్నార్ ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం చెబితే ఏది ఏమైనా ఆలా కొట్టడం తప్పు తనకేదైనా జరగరానిది జరిగితే నువ్వు జైలు పాలు కావాల్సి వచ్చేది తల్లి అంటూ ఏఎన్ఆర్ చెప్పినట్లు డిస్కో శాంతి వెల్లడించారు.
































