Siddu Jonnalagadda:సిద్ధు జొన్నలగడ్డ ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. అయితే తాజాగా ఈయన నటించిన డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. సినిమా యావత్ యూత్ ని మొత్తం ఆకట్టుకోవడంతో సిద్ధు జొన్నలగడ్డకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీ అయ్యారు.

ఈ విధంగా సిద్ధ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో మంచి విజయం అందుకోవడంతో ఈయనతో సినిమా చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి పక్కా ప్రణాళికలు రచించారు.ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లారెడ్డి ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే సినిమా చేయాలని భావించారు.

ఇక తన ప్రొడక్షన్ లో హీరోగా సిద్దు జొన్నలగడ్డను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి మంత్రి హీరో సిద్దు జొన్నలగడ్డతో మాట్లాడగా ఆయన సింపుల్ గా మంత్రి మల్లారెడ్డి ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తనకు ఈ సినిమాలో నటించడం కుదరదంటూ మంత్రికి షాక్ ఇచ్చారు.
బెడిసికొట్టిన మంత్రిగారి ప్లాన్..
ఇలా ఒక వైపు మంత్రిగా కొనసాగుతూ మరోవైపు ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టిన మల్లారెడ్డి సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయాలని పక్కా ప్రణాళికలు రచించారు. సిద్దు జొన్నలగడ్డ అతనితో సినిమా చేయడానికి తిరస్కరించడంతో ఈయన ప్లాన్ బెడిసికొట్టింది. మరీ సిద్దు స్థానంలో ఏ హీరోని తీసుకు వస్తారో తెలియాల్సి ఉంది.

































