YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈ ఎన్నికలలో ఈయన ఘోరమైన ఓటమిని చవి చూశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. అక్కడ రెండు రోజులపాటు అభిమానులను కార్యకర్తలను కలిసిన ఈయన తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు.

ఇలా బెంగళూరు నుంచి ఈయన రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తుంది. అక్కడ మీడియా వారి కంట కనపడకుండా ఎవరిని కలవకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కనిపించని నేపథ్యంలో ఈయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ తో భేటీ అయ్యారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో తిరిగి తాను అధికారంలోకి రావాలి అంటే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సరైన పద్ధతిని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి పార్టీని విలీనం చేయడంపై సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది అంతేకాకుండా డీకే శివకుమార్ ని కలిసినట్టు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అన్నీ అవాస్తవాలే..
ఇలా జగన్మోహన్ రెడ్డి తనని కలిసారని పార్టీ విలీనం గురించి మాట్లాడారంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా కూడా అవాస్తవమేనని తెలిపారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు లేవని ఆయనను ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదని సోషల్ మీడియాలో మా గురించి వస్తున్న వార్తలన్నీ ఆ వాస్తవం అంటూ అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.





























