ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మంచి లేదా చెడు ఏదైనా పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు కోపం వచ్చి వారిపై చేయి చేసుకుంటారు. కానీ పిల్లల్ని కొట్టడం వల్ల వారిలో మార్పు రాకపోవడం సరి మీపై నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది.

తాజాగా ఈ విషయం గురించి అధ్యయనం చేయటం వల్ల తేలిన విషయం ఏమిటంటే పిల్లల్ని కొట్టడం వల్ల వారిలో మార్పు రాకపోగా వారి బుద్ధి మందగిస్తుంది. అలాగే పిల్లల్లో తల్లిదండ్రుల మీద నమ్మకం పోయి ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతారు.
మన భారతదేశం మరియు ఇతర 30 దేశాలలో పిల్లలను కొట్టటం నేరం కాదు. కానీ 62 దేశాలలో పిల్లల్ని కొట్టడం నేరంగా పరిగణిస్తారు. యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం 25 కోట్ల మంది రెండు నుండి 4 సంవత్సరాలలోపు పిల్లలు శారీరక హింసకు గురవుతున్నారు.
పిల్లలు మనకి ఇబ్బంది కలిగించే పనులు చేసినప్పుడు కోపం వచ్చి వారిని కొట్టడం మంచిది కాదు. అలా చేయటం వల్ల వారు మన మాట వినకుండా ఇంకా మొండిగా తయారవుతారు. పిల్లలకి మంచి, చెడు గురించి వివరించి ఇంకొకసారి అటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వారికి నచ్చచెప్పాలి. అలా కాకుండా వారిపై చేయి చేసుకోవడం ఏమాత్రం సరి అయినది కాదు.






























