కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం అందరిని తీవ్ర దుఃఖసాగరంలోకి నెట్టింది.కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ గుండెపోటుతో అకాలమరణం చెందారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక పునీత్ అశ్విని జంట చెప్పగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా ఉంటారు.

పునీత్ అశ్విని మొట్టమొదటిసారిగా 1996 లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశారు. అప్పటి నుంచి తరచూ కలుస్తూ మాట్లాడుకునే వారు. ఒక ఎనిమిది నెలల తర్వాత తన జీవిత భాగస్వామి అశ్విని అని పునీత్ ఫిక్స్ అయ్యాడు.ఇదే విషయాన్ని అశ్వినికి చెప్పడంతో ఆమె మారు మాట్లాడకుండా తన ప్రేమను అంగీకరించింది.

తన ప్రేమ విషయాన్ని తన ఇంట్లో చెప్పడానికి పునీత్ వెనకడుగు వేసినప్పటికీ ధైర్యం చేసి ఒక రోజు తన తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న మిమ్మల్ని కలవడానికి మీ అభిమాని ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పగానే నాన్నకు అర్థమయ్యే వెళ్లి మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు.ఇలా పునీత్ కుటుంబం నుంచి తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ రాగా అశ్విని కుటుంబం అతనితో పెళ్లికి మొదట ఒప్పుకోలేదు.

ఆరు నెలల తర్వాత వీరి పెళ్లికి అంగీకరించిన అశ్విని కుటుంబం 1999 డిసెంబర్ ఒకటవ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా పెళ్లి తర్వాత అంత పెద్ద కుటుంబంలో ఎంతో తొందరగా కలిసిపోయిన అశ్విని అందరితోనూ ఎంతో తొందరగా కలిసిపోతుంది.ఇలా వీరి ప్రేమకు గుర్తుగా వీరికి ధ్రుతి, వందిత అనే ఇద్దరూ కూతుర్లు జన్మించారు. ఇలా ఎంతో చూడముచ్చటగా, చూడచక్కగా ఉన్న ఈ జంట పట్ల విధి చిన్నచూపు చూసింది. ఈ క్రమంలోనే అతి చిన్న వయసులోనే పునీత్ తీసుకెళ్తూ అశ్విని ఒంటరిని చేశాడు ఆదేవుడు అంటూ అభిమానులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.


































