Sandeep Reddy: సినీ ఇండస్ట్రీలో కేవలం మూడు సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈయన దర్శకుడిగా అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు.

హిందీలో కబీర్ సింగ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి తన చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నారు. ఇదిలా ఉండదా తాజాగా సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా తన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తనకు బాబు పుట్టాడని అందుకే తన పేరును కూడా అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నాను అని తెలిపారు. అర్జున్ రెడ్డి అనే పేరులో ఏదో తెలియని షార్ప్ నెస్ ఉంటుందని సందీప్ రెడ్డి తెలిపారు. ఇలా అర్జున్ రెడ్డి సినిమా పేరును తన కొడుకుకు పెట్టుకున్నారనే విషయం తెలియడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

































