Balakrishna Remakes: ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల హవా నడుస్తోంది. ఒక భాషలో విడుదలై మంచి విజయం సాధించిన సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి ఇతర భాషలలో విడుదల చేసేవారు కాదు. అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఇతర భాషలలో మంచి విజయం సాధించిన సినిమాలను రీమేక్ చేస్తూ తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ నటించిన రీమేక్ సినిమాలు ఇక్కడ తెలుసుకుందాం…

బాలకృష్ణ నటించిన లయన్ సినిమాని హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘టోటల్ రీకాల్’కు ఇన్‌స్ప్రేషన్‌గా తీసుకొని తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాని ఆధారంగా బాలకృష్ణ పాండురంగడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.తమిళంలో కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమాకి రీమేక్ సినిమా బాలకృష్ణ ఒక్క మగాడు చిత్రంలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

తమిళంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘సామి’ మూవీకి రీమేక్‌గా బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాలో నటించారు. కన్నడలో హీరో విష్ణువర్ధన్ హీరోగా నటించిన రాజ నరసింహ సినిమాకి రీమేక్ చిత్రంగా పలనాటి బ్రహ్మనాయుడు సినిమాల్లో నటించారు ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు.గొప్పింటి అల్లుడు’ సినిమా హిందీలో గోవిందా హీరోగా తెరకెక్కిన ‘హీరో నంబర్ 1’ సినిమాకు రీమేక్.
రీమేక్ చిత్రాలతో హిట్ కొట్టిన బాలయ్య…
వీటితోపాటు బాలకృష్ణ నటించిన శ్రీకృష్ణార్జున విజయము, భైరవ ద్వీపం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ముద్దుల మేనల్లుడు, అశోక చక్రవర్తి, ముద్దుల మామయ్య, రాముడు భీముడు, మువ్వగోపాలుడు, రాము, బాబాయ్ అబ్బాయ్, ఆత్మబలం మంగమ్మగారి మనవడు వంటి సినిమాలన్నీ కూడా బాలకృష్ణ ఇతర భాషలలో విజయం సాధించిన సినిమాలకు చిత్రాల్లో నటించారు.
































