తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ఒక వింత జీవి పర్యటిస్తూ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అంతేకాకుండా వింత జీవి స్థానికుల కంటపడకుండా ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో పశువులను చంపేస్తుంది. ఆ జంతువు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో అనే భయంతో ఆ రెండు మండలాలలోని ప్రజలు నిత్యం భయపడుతూ ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నారు. ఈ విషయంపై ఎంతో ఆందోళన చెందిన రైతులు పశువులను చంపిన వింతజీవిని ఎట్టకేలకు గుర్తించారు.ఆలమూరు మండలం పెనికేరులోని బావిలో ఆ జంతువు ఉన్నట్లు ఈరోజు తెల్లవారుజామున ఆ వింత జీవిని రైతుల గుర్తించారు.

వింత జంతువును గుర్తించిన రైతులు దాని దగ్గరకు వెళ్లడానికి బయపడుతున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన ఆ జంతువు బయట ఉన్న జనాలను చూసి భయంతో బయటకి, లోపలికి వెళ్తుందని ఆ ప్రాంతంలోని రైతులు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విషయం గురించి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు,అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వింతజీవి ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ జంతువు ఏమిటి? ఏ జాతికి చెందినది అనే విషయాలు తెలియాలంటే ఆ జంతువును బావి నుంచి బయటకు తీస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి, ప్రజలను భయపెడుతున్న ఆ జంతువు ఏమిటనే విషయం తెలియదని అధికారులు తెలిపారు.బావి నుంచి ఆ జంతువును బయటకు తీయడానికి అధికారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎంతో శ్రమిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here