Dhanush Telugu Movie: ‘ధనుష్’ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ కోలీవుడ్ స్టార్ గా కొనసాగుతూనే ప్రస్తుతం హిందీలో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తన నటనకు ‘ఆడుకాలం’, ‘అసురన్’ చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డులు వచ్చాయి. హిందీలో చేసిన ‘రాంజానా’ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

తెలుగులో రఘువరన్ బీటెక్ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చింది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి ‘అత్రంగి రే’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో కోరకుంటున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.
Reserve Bank Of India: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు..జనవరి 1 నుంచి అమలు..ఆ వివరాలు తెలుసుకోండి..!
గతంలో కూడా ధనుష్ స్ట్రేయిట్ తెలుగు సినిమాలో నటించాలని ఉందని వెల్లడించారు. ఇన్నాళ్లు ఇటు ఫ్యాన్స్, అటు ధనుష్ కోరిక నెరవేరబోతోంది. తాజాగా ‘సార్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో రంగ్ దే, తొలిప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి దర్శకత్వంతో ధనుష్ సార్ సినిమా రాబోతోంది. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవల కాలంలో తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ లకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఇళయ తలపతి విజయ్ కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీకి కమిట్ అయ్యాడు. ఇది కూడా స్ట్రెయిట్ తెలుగు మూవీగా రాబోతోంది. ఇప్పటికే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాలో నటించారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.





























