Robo Movie: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ ఐశ్వర్య జంటగా తెరకెక్కిన రోబో చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒక విభిన్నమైన కథాంశంతో దర్శకుడు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇందులో ఒక రోబో మనిషిని ప్రేమించడం వంటి కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ కాన్సెప్ట్ 1995 మార్చి 31 విడుదలైన ఘటోత్గచుడు సినిమా నుంచి ప్రేరణగా తీసుకున్నారని తెలుస్తోంది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వరుస సినిమాలతో ఎంతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అనంతరం అలీ రోజా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఘటోత్కచుడు.

ఇక ఈ సినిమాలో అలీ హీరోగా రోజా హీరోయిన్ గా నటిస్తున్నారని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.కథ నచ్చడంతో ఈ సినిమాకి రోజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అప్పుడున్న ట్రెండ్ కు ఎంతో భిన్నంగా తెరకెక్కింది. సాధారణంగా పలు సినిమాలలో యముడు యమలోకం నుంచి భూలోకానికి వచ్చినట్లు చూపించగా ఈ సినిమాలో మాత్రం యముడికి బదులు ఘటోత్కచుడు భూమిపైకి వస్తాడు.

ఇక ఘటోత్కచుడి పాత్రలో సత్యనారాయణ తప్ప ఎవరు నటించలేరని ఆయనను ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రారంభంలోనే కురుక్షేత్ర యుద్ధంలో స్పెషల్ క్యామియోలలో నటించేందుకు డాక్టర్ రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి అగ్ర హీరోలు ఒప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విధంగా ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాతలు అచ్చిరెడ్డి, కిషోర్ రాఠీ.
మ్యూజికల్ హిట్…
ఇలా ఘటోత్కచుడు సినిమా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోజా ను రోబో ప్రేమిస్తున్నానని తన వెంట పడుతూ ఉంటారు. అయితే అప్పట్లో ఈ సన్నివేశం ఎంతో కొత్తగా అనిపించింది. ఇక ఇదే కాన్సెప్ట్ ను శంకర్ రోబో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ విధంగా 1995 మార్చి 31 విడుదలైన ఘటోత్గచుడుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన వారానికి బాషా, అమ్మాయి కాపురం లాంటి హిట్ మూవీస్ విడుదల కావడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై పడింది. అయితే ఈ సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.































