మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. మనం ఎన్నో ఏళ్ల నుంచి ఈ మాట వింటూనే ఉన్నాం. కానీ తయారు చేసి విక్రయించడం మానలేదు.. మందుబాబులు వాటిని కొనడం మానలేదు. ప్రాణానికి హాని చేపడుతుందని తెలిసి కూడా ఇలా మద్యం కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. కొంతమందికి అది లేకపోతే రోజులో నిద్ర కూడా పట్టని పరిస్థితి నెలకొంది. అంతలా వ్యసనానికి అలవాటు పడ్డారు. అయితే కొన్ని పరిశోధనలు ఈ మద్యాన్ని మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతందని.. ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

మితంగా ఏది తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ మితి మించితే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరం. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని.. మరియు మరణాల ప్రమాదం 25% తగ్గుతుందని చెబుతున్నారు. మితమైన మద్యపానం తక్కువ ఒత్తిడి, జ్ఞాపకశక్తికి మెరుగుపరుస్తుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని కొంత మొత్తంలో ఆల్కహాల్‌తో తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుందట.
కానీ ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు కాలేయ వైఫల్యం వంటి సమస్యలు వస్తాయి. ఇతరుల కోసం మద్యం అస్సలు తాగకూడదు. అయితే డైట్ చేసేవారు దీనికి దూరంగా ఉండాలి. సరైన రీతిలో, తాగడం(drink) వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పలు పరిశోధనలు(research) చెబుతున్నాయి. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు మందు తాగడం అనేది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
మితమైన మద్యపానం గుండెపోటు, స్ట్రోక్ లేదా గట్టిపడిన ధమనులను 25% నుండి 40% వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల కొలెస్ట్రాల్ స్థాయిలను(హెచ్‌డిఎల్) పెంచుతుంది, ఇది శరీరానికి మంచిది. ఆల్కహాల్ పరిమాణాన్ని బట్టీ ఎప్పుడో తీసుకునే వారు మితంగా ఆల్కహాల్ ను తీసుకోవచ్చు.































