మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి నుంచీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం, ఇందులో నటించిన అతిథి పాత్రలు. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటులు ఈ చిత్రానికి గ్లామర్ అడ్డ్ చేశారు. తాజాగా వీరు అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తన తొలి తెలుగు సినిమా చేశాడు. శివుడి పాత్రలో కనిపించిన అక్షయ్, ఈ పాత్ర కోసం రూ. 6 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు సమాచారం. అక్షయ్ ఎప్పుడూ పారితోషికం విషయంలో రాజీ పడడు. ఇదే విషయాన్ని గతంలోనే అతడు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు.
ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ‘కన్నప్ప’ సినిమాలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటించాడు. శివుడిగా కనిపించే రుద్రుడి పాత్రలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల స్క్రీన్ టైమ్ అందించాడు. ఆయన ఈ సినిమా కోసం ఎన్నో రోజులు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నది సమాచారం. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాకు ఒక్క రోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నా, ఉచితంగా నటించారు.
అలాగే కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి నటులు ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. వీరందరికీ తలో రూ. 1 కోటి చొప్పున రెమ్యునరేషన్ అందించినట్టు సమాచారం. తమిళ నటి ప్రీతి ముకుందన్ కూడా ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు.
ఈ మూవీని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రముఖ టీవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు, విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం వల్ల నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎంతోమంది ప్రముఖులు, అతిథి పాత్రల్లో మెరిసిన నేపథ్యంలో, సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్‌లు పారితోషికం లేకుండా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడం చిత్రసీమలో అరుదైన విషయం అని చెప్పొచ్చు.






























