Rajamouli: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో సీరియల్స్ కి దర్శకత్వం వహించి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన రాజమౌళి ఓటమెరుగని విక్రమార్కుడుగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో ఎంతోమంది నెటిజన్లు దర్శకుడు రాజమౌళి గురించి కూడా ఆరా తీస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి రాజమౌళి ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే రాజమౌళి ఒక్కో సినిమాకు సుమారు 24 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.
లాభాలలో వాటా…
రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన బాహుబలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా నుంచి రాజమౌళి రెమ్యూనరేషన్ కాకుండా సినిమా లాభాలలో 30 శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఈయన ఆస్తుల విషయానికి వస్తే సుమారు 150 కోట్ల వరకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అలాగే ఖరీదైన బంగ్లాలు, కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. గత మూడు సంవత్సరాలలో ఆయన ఆస్తులు 40 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.































